కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల, జనవరి15 (విజయ క్రాంతి): జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. బుధవారం సమీకత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్, అదన పు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసిహొ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వహొ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని అన్నారు. ప్రభు త్వానికి తిరిగి అప్పగించడానికి ముందుకు వచ్చాడన్నారు. ఇదే మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుస్స లింగం సర్వే నెం బర్ 365/అ/2లో ఎకరం ప్రభుత్వ భూమి ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి ముందుకు వచ్చాడన్నారు.
జిల్లాలో ఎవరై నా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదు రు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజ ల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామ న్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.