మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్
మహేశ్వరం, ఆగస్టు 26: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే రాష్ట్రంలోని మెజార్టీ చెరువులు ఆక్రమణకు గురయ్యాయని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆరోపించా రు. సోమవారం తుక్కుగూడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమా ర్కులపై చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం నియోజవర్గం పరిధిలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలపై సమగ్ర విచారణ జరిపించి ఆట కట్టిస్తామన్నారు. పలువురి నుంచి భూకబ్జాలకు సంబంధించిన అర్జీలను స్వీకరిం చారు.
తుమ్మల చెరువు కబ్జాపై..
తుమ్మల చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్‌నగర్‌లో 8 ఎకరాల తుమ్మల చెరువు కబ్జాకు గురైందన్నారు. ఆయన వెంట పార్టీ నేతలున్నారు.