ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేసిన పూజారులు..
లంక బిందెలు దొరియని గ్రామంలో జోరుగా ప్రచారం..
మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సింగిరెడ్డి పల్లెలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామంలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి వేళలో క్షుద్ర పూజలు చేస్తుండగా గుర్తించిన గ్రామస్తులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు పూజలు చేసిన ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో పూజలు చేసినట్టుగా ఆధారాలు కనబడంతో గ్రామ ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు.
దీంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి గ్రామ ప్రజలను ఎవరినీ కూడా ఇంట్లోకి వెళ్ళనీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజలు చేసిన కొంతమంది తాంత్రికలను గుర్తించిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్షుద్ర పూజలలో లంక బిందెలు దొరియని గ్రామంలో జోరుగా ప్రచారం సాగుతోంది. గ్రామంలో క్షుద్ర పూజల వ్యవహారం సంచలన సృష్టించింది.