పెద్దపల్లి: శనివారం అర్ధరాత్రి తర్వాత పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్న పలువురిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని పెద్దపల్లి స్టేషన్ కు తరలించారు. చందపల్లి ఎస్సారెస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గుడారం ఏర్పాటు చేసుకుని అర్థరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు. అ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అక్కడ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.