calender_icon.png 13 March, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లీలావతి ఆసుపత్రిలో క్షుద్రపూజలు!

13-03-2025 02:14:24 AM

  1. ట్రస్టీల కార్యాలయం కింద ఎముకలు, వెంట్రుకలు
  2. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించిన ట్రస్టీ కీర్తిలాల్ మెహతా

ముంబై, మార్చి 12: లీలావతి ఆసుపత్రిలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఆసుపత్రిలో క్షుద్రపూజలు జరిగాయని ట్రస్టీలు ఆరోపించారు. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్ జరిగింద నే విషయం అందర్నీ షాక్‌కు గురి చేసిం ది. పాత ట్రస్టీలు రూ. 1200 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించినట్లు లీలావతి ఆసుపత్రి ప్రస్తుత ట్రస్టీ కీర్తిలాల్ మె హతా ఆరోపించారు.

ఆసుపత్రి ప్రాంగణంలో క్షుద్రపూజలు కూడా జరిగాయ న్నారు. ట్రస్టీ కార్యాలయం కింద మనిషి ఎముకలు,  వెంట్రుకలతో కూడిన ఎనిమిది కుండలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. దీని మీద ఆయన పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆసుప త్రికి చెందిన మాజీ ట్రస్టీలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఆసుపత్రిలోని నిధుల గోల్‌మాల్ గు రించి ముఖ్యంగా ఫిర్యాదు చేశారు. 

ఆడిట్‌లో బయటపడ్డ గోల్‌మాల్ 

ఎన్నో న్యాయ వివాదాల తర్వాత ప్రస్తుత ట్రస్టీలు ట్రస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చేతన్ దలాల్  ఇన్వె స్టిగేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఏడీబీ అండ్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ ఆ డిట్ నిర్వహించగా.. అనేక అవకతవక లు బయటపడ్డాయి. ఇది వరకున్న ట్రస్టీ లు నిధులు పెద్ద ఎత్తున తారుమారు చేస్తూ పక్కదారి పట్టించారని బయటపడింది.