calender_icon.png 12 March, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసి ముస్లీంలను బీసీ-ఈ జాబితాలో చేర్చాలి

11-03-2025 09:07:57 PM

శాసన సభలో ప్రజాప్రతినిధులు చర్చించాలి...

మైనారిటీ జిల్లా అద్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఓసీ ముస్లీంలను బీసీ-ఈ జాబితాలో చేర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండి. యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్, డిసెంబర్ లలో రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నందు 8, 80, 424(2.48 శాతం)  ఓసీ ముస్లీంలుగా గుర్తించటం జరిగిందని, ఈ ముస్లీంలలో సయ్యద్, పఠాన్ లతో పాటు మరో 14 ఉప‌కులాలకు చెందిన వారున్నారని, వీరిలో దాదాపు 80 శాతం మంది ఆర్దికంగా, విద్యాపరంగా వెనుకబడి  ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లకు దూరమవుతున్నారని, ఈ వర్గాలలో ఉన్న  అత్యంత పేద ముస్లీంలను గుర్తించి బీసీ-ఈ లో స్థానం కల్పించే విధంగా నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ సమావేశాలలో ప్రజాప్రతినిధులందరూ చర్చించాలని కోరారు.