జగిత్యాల అర్బన్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి) : విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు జగి త్యాల పట్టణ సిఐ వేణుగోపాల్ తెలిపారు.
శనివారం అర్ద రాత్రి బాంబే షాపింగ్ మాల్ పక్కనగల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేస్తున్నారనే సమాచారంపై అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ రాకేశ్, హోమ్ గార్డ్ విజయ్ కుమార్ల పట్ల దురుసుగా ప్రవర్తించి, బంక్ సిబ్బందిపై దాడి చేసిన నిందితులైన బోతుకాని శేఖర్, తుమ్మల గంగారాంలపై రెండు కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు.
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులపై కేసులు నమో దు చేశామని ఆయన తెలిపారు. ఈ సంఘ టనపై సోషల్ మీడియాలో తప్పుడు కథనా లు ప్రసారం అవుతున్నాయని, నిజా నిజా లు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఐ హెచ్చరించారు.