కాలం మారింది. కాలంతో పాటు యువత ఆలోచన విధానం మారింది. వ్యక్తిగత విషయాల్లో చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా రిలేషన్‌షిప్, పార్ట్‌నర్ విషయంలో కొన్ని అభిరుచులను కలిగి ఉన్నారు. రిలేషన్ షిప్‌లోకి అడుగు పెట్టడమే కాదు. తమ బంధం బలంగా, రొమాంటిక్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు.
అందుకోసం పార్ట్‌నర్ చేసే చిన్న చిన్న పనులను కూడా గమనించడం, అభినందించడం, పరస్పరం సహకరించుకోవడం వంటివి ఇక్కడ ప్రయారిటీ అంశాలుగా ఉంటాయి. డేటింగ్ కల్చర్‌లో వీటిని ‘గ్రీన్ ఫ్లాగ్స్’ అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
రొమాంటిక్ రిలేషన్‌షిప్ సవ్యంగా కొనసాగాలంటే.. పార్ట్‌నర్‌లో ఆత్మవిశ్వాసం కూడా నిండుగా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటోంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్నవాళ్లు తమను ఎవరైనా తమను జడ్జ్ చేస్తారేమోనని అస్సలు భయపడరని నిపుణులు చెబుతున్నారు. పైగా తమ ఫీలింగ్స్‌ను స్వేచ్ఛగా బయట పెడతారు. అదీగాక ఆత్మ విశ్వాసం కలిగిన పార్ట్‌నర్ వల్ల తాము సురక్షితంగా ఉంటామని చాలామంది భావిస్తారట. అందుకే ఈ జనరేషన్ వాళ్లు తమ భాగస్వామిలో సెల్ప్ కాన్ఫిడెంట్ ఉండాలని కోరుకుంటున్నారు.
ఫీలింగ్స్..
ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కానీ ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం, ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం వంటివి తమ పార్ట్‌నర్‌లో ఉండాలని ఈరోజుల్లో చాలామంది కోరుకుంటు న్నారు. చెప్పేది విని అర్థం చేసుకోవడం, అవతలి నుంచి కూడా అదే విధమైన శ్రద్ధ కనబర్చడం వంటి బంధాన్ని బలోపేతం చేస్తుందని ఈతరం భావిస్తున్నట్లు రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.
కమ్యూనికేషన్..
రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకానీ ఒకరి గురించి ఏమీ తెలియకుండా, పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తిని తమ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా జడ్జ్ చేయడం ఎవరి కీ నచ్చదు. ఇది అర్థం చేసుకోవడం తో పాటు పార్ట్‌నర్‌తో ప్రేమగా, గౌరవంగా మాట్లాడటం, భావాల ను నిజాయితీగా చెప్పడం, అభిప్రా య భేదాలు తలెత్తితే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవడం వంటివన్నీ రిలేషన్‌షిప్‌లో మంచి కమ్యూనికేషన్ కిందికి వస్తాయి.
ఒత్తిడి..
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మాటలు, ప్రవర్తన దాని నుంచి బయటపడేసేలా ఉండాలి. కానీ మరింత ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు. రిలేషన్‌షిప్‌లో ఇది ముఖ్యమని నేటి యువత భావిస్తోంది. తాము ఎంపిక చేసుకోబో యే భాగస్వామిలో కూడా ఆ లక్షణాలు ఉండాలని కోరుకుంటోం దని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తిగత సమస్య అయినప్పటికీ పార్ట్‌నర్ పట్టించుకోగలగాలి. మనసు తెలుసుకొని మసలుకోవాలి. సలహాలు, సూచనలు ఇవ్వడం, కలిసి పరిష్కారం వెతకడం వంటివి చేయాలి. ఇది స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌కి ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
బాధలో..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు, నష్టాలు, బాధలు, భావోద్వేగాలు వస్తుంటాయి. అలాగని అవి శాశ్వతం కాదు. సంతోషాలు, సరదాలు వంటి అంశాల్లో భాగస్వామికి ఎలా సపోర్టుగా ఉంటారో, బాధలో ఉన్నప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు కూడా అలాగే ఉండాలని నేటి యువత కోరుకుంటున్నట్లు రిలేషన్‌షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. పైన పేర్కొన్న ఐదు లక్షణాలు కలిగిన వ్యక్తిని పార్ట్‌నర్‌గా పొందాలనే యువత కోరుకుంటున్నది. వీటినే డేటింగ్ కల్చర్‌లో ‘గ్రీన్ ఫ్లాగ్స్’గా పేర్కొంటారు.