calender_icon.png 25 December, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రింకర్స్‌ను అబ్జర్వ్‌చేసి సాయి క్యారెక్టర్ చేశా

25-12-2024 12:57:27 AM

ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు ధర్మ మంగళవారం మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. 

* నేను ‘సింధూరం’ సినిమాలో నటించాను. మొదట ఒప్పుకున్న ఫస్ట్ మూవీ ‘డ్రింకర్ సాయి’నే. ‘సింధూరం’ ఫస్ట్ రిలీజ్ అయ్యింది. కాబట్టి ఇది నా రెండో చిత్రం అయ్యింది. ఈ కథ విన్నప్పుడు ఎగ్జుటై అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. 

* వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి మూవీ చేశాం. ఈ సినిమా 2019లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ షూటింగ్ చేశాం. డైరెక్టర్ మొదట అనుకున్న కథకు లాక్ డౌన్‌లో మరికొన్ని మార్పులు చేసి రూపొందించారు. మారుతి గారి దగ్గర రైటర్‌గా వర్క్ చేసిన ఆయన ఎంతో అంకితభావంతో ఈ సినిమా తీశారు. 

* హీరోయిన్ ఐశ్వర్యశర్మ మంచి నటి. ఐశ్వర్య ఎప్పుడూ మూవీ గురించే ప్యాషనేట్‌గా వర్క్ చేసేది. బాగీ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంటుంది. ఆమెతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. 

* ‘సాయి’ క్యారెక్టర్ చేసేందుకు చాలా మంది డ్రింకర్స్‌ను అబ్జర్వ్ చేశాను. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. మా డైరెక్టర్ నన్ను కొన్ని బార్లకు తీసుకెళ్లి తాగిన తర్వాత వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూపించారు. అలా తాగేవారి బాడీ లాంగ్వేజ్ తెలిసింది. 
* -ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్.. మా మూవీ కథ గురించి చిరంజీవికి చెబితే బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలా మా మూవీకి మెగాస్టార్ బ్లెస్సింగ్స్ దక్కాయి. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు మంచి లవ్‌స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ట్రైలర్, టీజర్‌లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం. మా సినిమా యూత్‌ను చెడగొట్టేలా ఉండదు. సెకండాఫ్‌లో కథ మరో స్థాయికి వెళ్తుంది. 
* తొలుత సినిమా ఇండస్ట్రీకి వద్దన్న మా నాన్న ఈ సినిమా చూసి అభినందించారు. నువ్వు ఈ ఫీల్డ్‌కు సెట్ అవుతావంటూ ఫస్ట్ టైమ్ నన్ను మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోలు చాలా ఆనందాన్ని చ్చింది. ఇప్పటివరకు చాలా కథలు విన్నాను. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తా.