నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ యందు ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు మద్నూర్ సొసైటీ సీఈఓ తో కలిసి మంగళవారం పరిశీలించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కాంట చేయాలని సూచించారు, అలాగే అన్ని గ్రామాల రైతులు ఒకేసారి సోయాబీన్ పంటలను కేంద్రానికి తీసుకురాకుండా గ్రామాల వారిగా తేదీలు ఇవ్వడం జరుగును కావున ఏ గ్రామానికి ఏ తేదీ ఇచ్చారో ఆ రోజు తీసుకురావాలని, తద్వారా కొనుగోలు కేంద్రమంలో రద్దీ ఏర్పడకుండా, రైతులు నిరీక్షణ చేయకుండా ఉంటారు. రైతులు సోయాబీన్ తీసుకువచ్చేటప్పుడు మీ మీ గ్రామాల ఏఈఓ గారి వద్ద టోకెన్ రాపించుకొని కేంద్రానికి రాగలరు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బాబు రావ్, సౌమ్య, అనిల్, బజాన్న, రైతులు పాల్గొన్నారు.