calender_icon.png 4 March, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలోని పలు చరిత్రక ప్రదేశాలను, ఉపాధి హామీ పనులను పరిశీలన

04-03-2025 06:49:31 PM

మండలకేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం..

డిఆర్డిఓ పిడి మండల ప్రత్యేక అధికారి సురేందర్...

లింగంపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులతో పాటు మండల కేంద్రంలోని వివిధ చారిత్రక ప్రదేశాలను మంగళవారం డిఆర్డిఓ పిడి మండల ప్రత్యేక అధికారి సురేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని చారిత్రక కట్టడం నాగన్న గారి బావిని, నగరేశ్వరాలయం ముందున్న గాలికి ఊగే స్తంభాన్ని, జోగినాథ ఆలయాన్ని, అక్కడే ఉన్న స్వరంగ మార్గాన్ని, బండలపై గల నీటికొలను ఆయన సందర్శించారు. జోగినాథ ఆలయానికి వెళ్లడానికి దారి సరిగ్గా లేకపోవడంతో ఉపాధి హామీ ద్వారా ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

చారిత్రక కట్టడాల అభివృద్ధికి నిధులను సేకరించి మండల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని అన్నారు. అనంతరం మండలంలోని పర్మల్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడుతూ... ఎండలు ఎక్కువగా ఉన్నందువలన ఉపాధి కూలీలు ఉదయం తొందరగా రావాలని, పనుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న చేపల చెరువు, పశువుల పాక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ వివరాలను స్థానిక సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీడీవో నరేష్, ఏపీవో నరేందర్, ఇన్చార్జి ఈసీ రాజు, టిఏలు అమర్, గణేష్, వినోద్, పంచాయతీ కార్యదర్శి శ్వేత ఉన్నారు.