calender_icon.png 15 January, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

10-09-2024 04:52:10 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద  గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, ఆర్డిఓ హరికృష్ణ, ఏసీబీ ఏ రవికుమార్ లు పరిశీలించారు. నిమజ్జనొస్తవానికి సంబంధించి చెరువు వద్ద పిచ్చి ముక్కలు తొలగించేలా ఏర్పాటు చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో చెరువులో పూడిక మట్టిని తొలగించారు. ప్రతి ఏటలాగే ఈసారి కూడా గణేష్ మండపాల నిర్వాహకులు మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోచమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టు మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ దేవయ్య, 4 వార్డు కౌన్సిలర్ షేక్ అస్మా, కౌన్సిలర్ రాము నాయక్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.