calender_icon.png 15 November, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాకు గురైన పెద్దచెరువు పరిశీలన

24-09-2024 12:09:22 AM

ఇబ్రహీంపట్నానికి హైడ్రా బృందం

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కబ్జాకు గురైన అంశంపై ఈ నెల 9న విజయక్రాంతి పత్రికలో ‘అక్రమార్కుల చెరలో పెద్ద చెరువు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై హైడ్రా అధికారులు స్పందించారు. సోమవారం హైడ్రా అసిస్టెం ట్ కమిషనర్ పాపయ్య బృందం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే రూరల్ ప్రాం తంలోని చెరువులు, నాలాలనూ పరిశీలించింది.  దీంతో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడున్నట్లు సమాచారం. పర్యటనలో ఏసీ పీ రాజు, ఇరిగేషన్ డీఈ ఉషారాణి, ఏఈ రాజ్యలక్ష్మి ఉన్నారు. పెద్దచెరువుతో పాటు తుర్కయంజాల్ మాసబ్ చెరువూ కబ్జాకు గురయ్యాయి. వాటి ఆక్రమణలపైనా హైడ్రా దృష్టి సారించినట్లు సమాచారం.