కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 4 (విజయక్రాంతి): జిల్లాలో సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను సమన్వయంతో కృషి చేసి సాధించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, అదనపు కలెక్టర్ దిపక్‌తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌తో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నీతిఅయోగ్‌లో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు.
జిల్లాను సంపూర్ణత అభియాన్ ద్వారా ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్య, ఐసీడీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ సురేందర్, డీఎంహెచ్‌వో తుకారం, డీడబ్ల్యూవో భాస్కర్, ఎపీడీ రామకృష్ణ, జెడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, రామరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.