* ప్రతివాదిగా అనుమతించాలన్న బాధితుడు
* ఫిబ్రవరి 27కు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): సిరిసిల్ల నేరెళ్లలో దళితులపై దాడికి సంబంధించి సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిల్‌లో తనను ప్రతివాదిగా చేర్చాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టును అభ్యర్థించారు. చిత్రహింసల కేసులో పోలీసుల పాత్ర లేదం టూ ఐజీ ఇచ్చిన నివేదిక తప్పని పేర్కొన్నారు. పోలీసులు చిత్రహింసలు పెట్టారని, తమపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్నారు.
సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి ఇసుక లారీలు, టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరిగాయి. 2017, జులై 2న ఎరుకల భూమయ్యను లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. దీనిపై దళితు లు నిరసన చేపట్టగా ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు దళితులపై కేసు న మోదు చేశారు. దళితులపై దాడి సంఘటన సీబీఐతో జరిపించాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలని ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ దాఖ లు చేసిన రెండు వేర్వేరు పిల్‌లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణిలతో కూడిన ధర్మాసనం బుధ వారం విచారణ చేపట్టింది.
ఇందులో పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తూ బాధ్యుడైన ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెం డ్ చేస్తూ, శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణలో ఆరోపణలు రుజువు కాకపోవడంతో సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.