calender_icon.png 31 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీటీసీ స్థానాల మార్పుపై పార్టీల అభ్యంతరం

31-01-2025 07:31:20 PM

భౌతికంగా పక్కనే ఉన్న స్థానాల్లో కలపాలని సూచన...

అశ్వరావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేటను మున్సిపాలిటీగా మార్చడంతో ఇప్పటివరకు 17 ఎంపీటీసీ స్థానాలుగా ఉన్న అశ్వరావుపేట మండలాన్ని 11 స్థానాలకు కొధిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతంలో అశ్వరావుపేట పంచాయతీలో నాలుగు స్థానాలు, పేరాయి గూడెం పంచాయతీ అల్లిగూడెం పంచాయతీ పరిధిలో రెండు స్థానాలు ఉండేవి. రెండు పంచాయతీలు నూతనంగా ఏర్పడినా మున్సిపాలిటీలో వినీలం కావడంతో ఆ మేరకు ఆరు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. దీంతో అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లికేషన్ చేశారు. ఈ పబ్లికేషన్ పై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.

నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని పంచాయతీలను ఏజెన్సీ స్థానంలోనూ, నాన్ ఏజెన్సీ పంచాయతీలను నాన్ ఏజెన్సీలో కలపాలనే నిబంధనల మేరకు నాన్ ఏజెన్సీలోని అల్లిగూడెం పంచాయతీని నానా ఏజెన్సీలోని ఎంపీటీసీ స్థానం ఊట్లపల్లిలో కలుపుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు. అల్లిగూడెం పంచాయతీని పక్కనే ఉన్న నారం వారి గూడెం పంచాయతీలో కలపాలని వేదాంతపురం పంచాయతీనే ఉట్లపల్లి పంచాయతీలో ఉండాలని సూచించారు. మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని రాజకీయ పార్టీలు తీర్మానం చేశాయి. పార్టీలు చెప్పిన మార్పులను అధికారులకు నివేదిక రూపంలో తెలియచేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీఓ సాయి ప్రసాద్ నాయకులు కట్రం స్వామి, చిరంజీవి, తుమ్మా రాంబాబు చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.