calender_icon.png 28 October, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి

28-10-2024 12:11:50 AM

జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 27(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు బీసీ మంత్రిత్వ శాఖను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆల్‌ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ తెలంగాణ సర్కిల్ అధ్యక్షుడు కే అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

బీసీ కులానికి చెందిన వ్యక్తి ఇప్పటివరకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కాలేదని వాపోయారు. రాజ్యసభలో బీసీ వాటా కోసం పోరాడాలని పిలుపుపినిచ్చారు. బీస్‌ఎస్‌ఎన్‌ఎల్ ఓబీసీ ఎంప్లాయీస్ సంఘం గుర్తింపు కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర సర్కిల్ సెక్రెటరీ ఎస్ శివకృష్ణ, అసోసియేషన్ నేతలు ధర్మరాజు, విజయ్ కుమార్, కే సురేశ్, సీమల శంకర్ పాల్గొన్నారు.