calender_icon.png 23 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒబామా మెచ్చిన భారతీయ సినిమా

22-12-2024 12:00:00 AM

తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎక్స్ వేదికగా తనకు నచ్చిన చిత్రాలు, పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి పోస్ట్ పెట్టారు. ఆయనకు నచ్చిన చిత్రాల్లో భారతీయ సినిమా టాప్‌లో ఉంది. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ అనే భారతీయ చిత్రం ఒబామాకు నచ్చిన చిత్రాల్లో తొలి స్థానంలో ఉంది. ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రంతో పాటుగా కాన్‌క్లేవ్, ది పియానో లెసెన్, ది ప్రామిస్డ్ ల్యాండ్, ది సీడ్ ఆఫ్ ది సెక్రెడ్ ఫిగ్ వంటి చిత్రాలు తనకు నచ్చాయని ఒబామా పేర్కొన్నారు.

అన్ని చిత్రాల మాటేమో కానీ ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రం గురించి ఒబామా మాట్లాడటంతో ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు అంతా సెర్చింగ్ ప్రారంభించారు. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పని చేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించా రు. కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేన్స్ చిత్రోత్సవాల్లోనూ ఇది ‘గ్రాండ్ పిక్స్’ అవార్డుని గెలుచుకుంది. 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు ఈ సినిమా నామినేట్ అవడంతో పాటు పలు విభాగాల్లో నామినేషన్లు దక్కించు కోవడంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేశారు.