calender_icon.png 10 January, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒబామాకు నచ్చిన సినిమా.. గోల్డెన్ గ్లోబ్ మెచ్చలే!

07-01-2025 12:00:00 AM

సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవా ర్డుల వేడుక కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్టాండప్ కమెడియన్ నక్కీ గ్లేజర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకల్లో భారతీయ చిత్రం నిరాశపరిచింది.

‘ఆల్ వీ ఇమాజిన్ యూజ్ లైట్’ చిత్రానికి అవార్డు వస్తుందని అంతా భావించారు. ఈ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం రెండు విభాగాల్లో పోటీ పడింది. ఒబామా మెచ్చిన ఈ సినిమాకు అవార్డు రాలేకపోవటం సినీప్రియులను నిరాశకు గురి చేసింది. 10 విభాగాల్లో నామినేషన్‌లు దక్కించుకున్న ‘ఎమిలియా పెరెజ్’ ఉత్తమ చిత్రం సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. 

విజేతలు..

ఉత్తమ చిత్రం: ఎమిలియా పెరెజ్

ఉత్తమ నటి: డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)

ఉత్తమ నటుడు: సెబాస్టియన్ స్టాన్ (ఎ డిఫరెంట్ మ్యాన్)

ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: ఫ్లో

ఉత్తమ దర్శకుడు: బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)

ఉత్తమ సహాయనటి: జోసల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)

ఉత్తమ నటుడు (టీవీ): హిరోయుకి సనాడా (షోగన్)

ఉత్తమ నటి (టీవీ): జెస్సికా గన్నింగ్ (బేబీ రైన్డీర్)

ఉత్తమ స్క్రీన్ ప్లే: పీటర్ స్ట్రాగన్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ట్రెంట్ రెజ్నార్ (ఛాలెంజర్స్)