calender_icon.png 18 January, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలకు ఒబామా గండం

26-07-2024 03:06:31 AM

  • ఇప్పటికీ అభ్యర్థిత్వంపై మద్దతు తెలపని మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్, జూలై 25: అమెరికా అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహ్యారీస్ పేరు దాదాపు ఖరారైంది. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నాయకులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అయితే, డెమోక్రాట్ల తరఫున స్టార్ క్యాంపెయినర్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇప్పటివరకు కమల అభ్యర్థిత్వంపై ఎలాంటి స్పందన ప్రకటించలేదు. కమల విషయంలో ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్‌పై ఆమె గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అధ్యక్ష బరికి కమలాహ్యారిస్ సమర్థురాలు కాదని ఒబామా భావిస్తున్నారు. సరిహద్దులకు వెళ్లని ఆమె వలసదారులకు ఆరోగ్య బీమా కల్పించాలని మాట్లాడుతున్నారు. 

మరొకరిపై ఒబామా దృష్టి

అధ్యక్ష అభ్యర్థిపై పార్టీ నిర్ణయంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆయన ముందుకరావట్లేదు ఒబామా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు బదులుగా అరిజోనా సెనేటర్ మార్క్‌కెల్లీని ఎంచుకోవాలని ఒబామా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయంపై ఒబామా మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. ఇదేకాకుండా బైడెన్ అభ్యర్థిత్వం విషయంలోనూ ఒబామా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించిన విషయం తెలిసిందే. బైడెన్‌కు విజయావకాశాలు తగ్గాయ, పలువురు పార్టీ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఒబామా సన్నిహితులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.