29-04-2025 12:53:03 AM
హైదరాబాద్, ఏప్రిల్28(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమా ణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, ఉపలోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్‌లతో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. లోకాయుక్తాకు హైకోర్ట్ ప్రధా న న్యాయమూర్తి హోదా, ఉపలోకాయుక్తకు హైకోర్ట్ న్యాయమూర్తి హోదా ఉంటుంది.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవం త్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, బీఎస్ జగ్జీవన్ కుమార్ తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్రంలో అవినీతిని నిరోధించేందుకు కృషి చేస్తారని ప్రమా ణ స్వీకారానికి హాజరైన వారు ఆశాభావం వ్యక్తం చేశారు.