సంగీతం తరహాలో అందమైనది తెలుగు భాష
ఎన్టీఆర్ వల్లే తెలుగు భాషకు..ప్రజలకు గౌరవం
హైదరాబాద్: మాతృభాషను కాపాడుకోవడం తెలుగు ప్రజల కర్తవ్యమని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు(World Telugu Writers Conference) జరుగుతున్నాయి. తెలుగుసభలకు జస్టిస్ ఎన్.వి. రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు భాష పరిరక్షణకు రామోజీరావు(Ramoji Rao) ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారని గుర్తుచేశారు. అతి ప్రాచీణ భాషగా తెలుగు గుర్తింపు పొందిందని చెప్పారు. మన తెలుగును 100 బిలియన్ల మంది మాట్లాడుతున్నారని వెల్లడించారు. సంగీతం తరహాలో అందమైనది తెలుగు భాష అన్నారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగును అణగదొక్కారని జస్టిస్ రమణ(Justice Ramana) ఆరోపించారు.
తెలుగు భాష(Telugu language) వృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని విమర్శించారు. మాతృభాషలోనే విద్యాబోధనతో కొన్ని దేశాలు అద్భుతాలు చేశాయని తెలిపారు. పరభాషను నేర్చుకొండి.. వ్యామోహం పెంచుకోకండని సూచించారు. మాతృభాషలో చదివి చాలా మంది ఉన్నత స్థితికి చేరారని చెప్పారు. తెలుగు భాషలోచదివి.. దేశ, విదేశాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రజాబాహుళ్యంలో మాతృభాషలోనే నిర్ణయాలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు తెలుగులోనే ఆదేశాలు ఇచ్చే ఆలోచన చేయాలని కోరారు. నందమూరి తారక రామారావు(N T Rama Rao) వల్ల తెలుగు భాషకు.. ప్రజలకు గౌరవం పెరిగిందని రమణ గుర్తుచేశారు. ప్రభుత్వాలు అవార్డులు కన్నా.. సమాజాన్ని మేల్కొలిపే రచనలే మిన్న అన్నారు. తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పత్రికలు, ఛానళ్లు తెలుగు అభివృద్ధికి పాటుపడాలని జస్టిస్ రమణ పిలుపునిచ్చారు. తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభిద్ధికి కృషి చేయాలన్నారు. తెలుగుకు మద్దతిచ్చేవారికే ఓటు అని ప్రజలతో చెప్పించాలి.. అలా చెప్పిస్తేనే.. తెలుగుకు అభివృద్ధి, వైభవమని ఆయన పేర్కొన్నారు.