calender_icon.png 23 February, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్స్ సో బెనిఫిట్స్

16-02-2025 12:00:00 AM

చాలామంది వృద్దులు తగినంత ఆహారం తీసుకోలేక ఇబ్బందులు పడుతారు. అలాంటివాళ్లు బాదం, పిస్తా వంటి గింజ పప్పులు (నట్స్) బాగా తోడ్పడుతున్నట్టు మోనాష్ యూనివర్సిటీ నేతృత్వంలోని అధ్యయన బృందం గుర్తించింది. డ్భె ఏళ్లు పైబడిన 9,916 మందిని పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు.

ఎలాంటి పప్పులైనా సరే. వీటిని తరచూ తినేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు తేలింది. అదీ మతిమరుపు, వైకల్యం వంటి ఇబ్బందులేవీ లేకుండా. గింజ పప్పుల్లో ప్రొటీన్, సూక్ష్మ పోషకాలు, అసంతృప్త కొవ్వులు, పీచు, దండిగా ఉంటాయి. కాబట్టి వీటిని చిరుతిండిగా గానీ భోజనంలో భాగంగా తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

పళ్లు బలంగా లేనివారు, నమిలే సమస్యల వంటివి గలవారు పూర్తి పప్పులను నమల్లేరు. ఇలాంటివారు పగలగొట్టి, ముక్కలు చేసుకొని సలాడ్లలో కలిపి తినొచ్చు. ఇప్పుడు నట్ మీల్స్, నట్ బటర్ లేదా పేస్టుల వంటివీ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పళ్లు బలంగా లేనివారికివి అనువుగా ఉంటాయి.

పెద్దవారు రోజుకు 30 గ్రాములు.. అంటే చిన్న పిడికెడు గింజ పప్పులు తినొచ్చనేది డాక్టర్ల మాట. 25 బాదం, 10 అక్రోట్లు, 40 వేరుశనగలు తినొచ్చు. వేర్వేరు రకాలను కలిపి తింటే వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. తాజా గింజ పప్పులు రుచిగా ఉండటమే కాకుండా వీటిల్లో పోషకాలూ ఎక్కువగానే ఉంటాయి.