calender_icon.png 22 April, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద ఎక్లరా గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమం

22-04-2025 06:21:30 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ కవిత అన్నారు. పెద్ద ఎక్లరా గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ... బాలింతలు తమ బిడ్డకు పాలు ఇచ్చినప్పుడే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరి చేరవని తెలిపారు.

గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కుటుంబ సభ్యులకు ఆహార ఆరోగ్య అలవాట్లు, వండే పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఆయమ్మలు సిద్ధమ్మ గంగామణి ఆశ వర్కర్లు మహాదేవి తదితరులు పాల్గొన్నారు.