calender_icon.png 19 April, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడిపాడులో పోషణ పక్వాడ కార్యక్రమం

16-04-2025 08:28:02 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శిరిడీ సాయి నగర్ సెక్టార్ గుడిపాడు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ భాగంలో పాల్వంచ సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ.. 1000 రోజుల ప్రాముఖ్యత, చిరుధాన్యాలు ప్రయోజనాలు, గర్భిణీలు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం గురించి ఆమె వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, కళ్యాణి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.