calender_icon.png 19 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉలవనూరులో పోషణ పక్వాడ్

17-04-2025 05:38:28 PM

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఉలవనూర్ సెక్టార్ బంజారా రైతు వేదికలో పోషణ పక్షంలో భాగంగా సామూహిక శ్రీమంతలు, అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీడీపీవో లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ... మొదటి 1000 రోజుల యొక్క ప్రాముఖ్యత గర్భవతి తను గర్భం ధరించిన దగ్గర నుండి సరియైన పోషకాహారం తీసుకోవాలి, కనీసం 4 సార్లు ఆరోగ్య పరీక్ష చెయించుకోవాలి, తగినంత విశ్రాంతి తీసుకొవాలన్నారు.

క్రమం తప్పకుండా వైద్యుల సూచన మేరకు ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకొవాలని, ప్రసవం అయ్యే వరకు 270 రోజులు, ప్రసవం అయినా దగ్గరనుండి 1సంవత్సరం (365రోజులు), రెండవ సంవత్సరం (365రోజులు) మొత్తం 1000  బిడ్డ జీవితంలో గోల్డెన్ డేస్ అని చెప్పాలి. ఈ దశలో బిడ్డ బ్రెయిన్ 80% డెవలప్ ఔతుంది. బిడ్డ పెరుగుదల అత్యంత వేగంగా ఉంటుందని, రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుందని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. నెలలు వెళ్ళిన తర్వాత హనుమంతు పోషకాహారం వయసు తగిన విధంగా పెడుతూ తల్లిపాలు కొనసాగించాలని వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని వారి యొక్క సంరక్షణ, ఆటపాటలతో వారి ఉల్లాసపరుస్తూ ఆహారం అందించాలన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలోని చదివించాలన్నారు.

సెక్టార్ సూపర్వైజర్ మాధవి మాట్లాడుతూ... లోకల్ లో దొరికే ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలని మునగాకు, ఇప్పపువ్వు ఆకుకూరలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది, కచ్చితంగా బిడ్డ యొక్క బరువులు ప్రతినెల పర్యవేక్షించు కోవాలని గర్భవతులు కూడా తప్పనిసరిగా బరువులు పర్యవేక్షించుకోవాలని రక్త హీనత రాకుండా ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రాములో ఆరోగ్య లక్ష్మి భోజనం తినాలని క్రమం తప్పకుండా ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లోనీ టీచర్స్ కృష్ణ కుమారి, చుక్కమ్మ నర్శిరతం చంద్రకళ ప్రమీల పద్మ అరుణ లక్ష్మి దేవి బంజార ఆశ పాల్గొన్నారు.