calender_icon.png 23 April, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూసుగూడెం సెక్టార్లో పోషక పక్వాడ్

19-04-2025 09:44:04 PM

ములకలపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొమ్ముగూడెం రైతు వేదికలో పూసుగూడెం సెక్టార్ శనివారం పోషక పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతలు, పుట్టినరోజు వేడుకలు అన్న ప్రసన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి ప్రాజెక్ట్ సీడీపీఓ హేమ సత్య, ఏసిడిపిఓ సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  గర్భిణీలకు పోష్టికహారంపై అవగాహనా కల్పించారు. గర్భిణీగా ఉన్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసారు. అలానే ఈ కార్యక్రమంకి పోజెక్ట్ పోషణ కోర్డినేటర్ వీరేంద్ర, ఏ ఎన్ ఎం రమాదేవి, అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్స్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.