25-04-2025 07:58:21 PM
కాటారం (విజయక్రాంతి): గర్భిణీలు, పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని గుండ్రాత్ పల్లి అంగన్వాడి టీచర్ వేమునూరి వెంకట్ లక్ష్మి అన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించే పోషణ పక్వాడ్ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గుండ్రాత్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ లక్ష్మి మాట్లాడుతూ... యుక్త వయసు బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. గర్భిణీ మొదటి రోజు నుండి రెండు సంవత్సరాలు నిండే వరకు వెయ్యి రోజుల ప్రాముఖ్యత జాగ్రత్తలు సూచించారు.
పౌష్టికాహారం ఉపయోగించే వంటకాలు తయారు చేయడంపై అవగాహన కల్పించారు. అందుబాటులో ఉండే ఆకుకూరలు, పాలు పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య అందించడం వలన శారీరక మానసిక అభివృద్ధి పెరుగుతుందని తెలిపారు. గర్భిణీలను పాలింతలకు పరిసరాల పరిశుభ్రత పోషక విలువలతో ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ, ఆయాలు, పలువురు తదితరులు పాల్గొన్నారు.