12-04-2025 07:21:12 PM
అంగన్వాడీలలో పోషణ... పక్వాడ కార్యక్రమం..
తుంగతుర్తి: తుంగతుర్తి ఐసిడిఎస్ పరిధిలోని గానుగుబండ, తూర్పు గూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా పోషణ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంగన్వాడి సూపర్వైజర్ మంగ, పల్లె దవాఖాన డాక్టర్ తేజలు హాజరై తదనంతరం వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8 నుండి 22 వరకు నిర్వహించే ఒక కార్యక్రమం.
ఇది పోషకాహారం గురించి అవగాహన కల్పించడానికి, తల్లి, బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నిర్వహించబడుతుందన్నారు. పోషన్ పక్వాడ 2025 అనేది కేవలం అవగాహన ప్రచారం మాత్రమే కాదు ఇది పోషకాహారం ఒక తల్లి ఒక బిడ్డ ఇద్దరు ఒక సమయంలో ఒక భోజనంగా మార్చే ఉద్యమం అధునాతన సాంకేతికతతో అంగన్వాడీ కార్యకర్తలను శక్తివంతం చేయడం, సంఘాలను భాగస్వామ్యం చేయడం ద్వారా భారతదేశం ఆరోగ్యకరమైన బలమైన తరం దిశగా ధైర్యమైన అడుగులు వేస్తుంది అనడానికి ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.