calender_icon.png 6 May, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగు బాలికల పాఠశాలలో పోషణ పక్వాడ్

21-04-2025 06:42:34 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వెలుగు బాలికల పాఠశాలలో సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో విద్యార్థులకు పోషణ పక్వాడ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ, అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు వివాహం చేసుకోకూడదని చెప్పారు. విద్యార్థినీలు చదువుతోపాటు క్రీడారంగాలలో పై ఆసక్తి చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి, అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి ,అరుణ జ్యోతి, భాగ్యమ్మ ,ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.