24-04-2025 12:27:45 AM
ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న
సిద్దిపేట, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారమే ముఖ్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న సూచించారు బుధవారం సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో గల వాడి కేంద్రాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరైన స్వప్న మాట్లాడారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని తద్వారా వారికి పౌష్టికాహారం అందుతుందన్నారు.
గర్భం దాల్చిన ప్రతి మహిళ అందుబాటులోని అంగన్వాడి కేంద్రంలో నమోదు చేసుకోవాలని చెప్పారు. బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలలోనే మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. పిల్లలకు చిన్నతనంలో చేసిన ప్రత్యేక కార్యక్రమాలు జీవితాంతం గుర్తుంటుందన్నారు.
పోషణ పక్వడ పురస్కరించుకుని వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలు తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సిఅర్పి శ్వేత, అంగన్వాడీ టీచర్లు అరుణ, జ్యోతి, యమున, ఆశ వర్కర్ మాధవి, ఆయాలు సుగుణ, ఆదిలక్ష్మి, రేణుక, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.