calender_icon.png 11 October, 2024 | 7:57 PM

పోషకాల చట్నీ!

10-10-2024 12:00:00 AM

చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్‌లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. 

చట్నీకి జీఐ ట్యాగ్..

రెడ్ వీవర్ యాంట్ చట్నీ (సిమిలిపాల్ కై చట్నీ) అంటే కాస్త వింతగా, విడ్డూరంగా ఉన్నా.. దీనిలో పోషక, ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దీని రుచి, పోషక విలువల వల్లనే ఈ చట్నీ ప్రసిద్ధి చెందింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మయూర్‌భంజ్ కై సొసైటీ లిమిటెడ్ 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, 1999 కింద సిమిలిపాల్ కై చట్నీని జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది.

చట్నీ ప్రత్యేకతను హైలైట్ చేస్తూ.. దీన్ని అప్లు చేశారు. దరఖాస్తు మూల్యాంకన తర్వాత.. దాన్ని ఆమోదించి.. ఆహార ఉత్పత్తుల వర్గీకరణలో ఈ చట్నీని అధికారికంగా పేరు సంపాదించుకుంది. 

పోషకాలు: ఈ చట్నీలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, క్యాల్షియం, జింక్, ఐరన్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.