calender_icon.png 23 December, 2024 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

16-09-2024 12:31:31 PM

పలు అనుమానులను వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు 

జడ్చర్ల : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జడ్చర్ల కు చెందిన ఓ నర్సింగ్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లకు చేందిన ఓ  యువతి(23) హోటల్ ఫ్యాన్ లో కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు.

గతంలో యశోద హాస్పిటల్ లో నర్సుగా పనిచేసిన యువతి, గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లోని ఓ హోటల్ లో ఫ్యానుకు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు...ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు జడ్చర్ల లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కోస్గి మండలానికి చెందిన యువతి తల్లిదండ్రులు గత మూడేళ్లుగా పోలేపల్లి సెజ్ లోని ఓ కంపెనీ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. యువతి మృతి పై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.