calender_icon.png 16 April, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ వృత్తి బాధ్యతతో నిర్వహించాలి

16-04-2025 09:46:23 AM

 జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్ భాస్కర్

భద్రాచలం,  (విజయ క్రాంతి): భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో మంగళవారం 'థ్యాంక్స్ గివింగ్' & ఫేర్వెల్ కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ నాయక్ మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని, అంకిత భావం, బాధ్యతతో నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలో అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని, నైపుణ్యత పెంచుకుని విదేశాలకు వెళ్ళుటకు నర్సింగ్ విద్యార్థినులు చొరవ చూపాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా  క్యాంపస్ సెలక్షన్స్ కింద 45 మంది విద్యార్థులు ఎంపికైనారు.

ఈ సందర్భంగా మారుతి నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాతూ బిఎస్సీ(నర్సింగ్) కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి, 45 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నందు 22 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనారు. మరియు భాస్కర మెడికల్ హాస్పిటల్ హైదరాబాద్లో 23 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపినారు.

అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన నర్సింగ్ విద్యార్థినులు మాట్లాడుతూ మేము మారుమూల గిరిజన ప్రాంతంలోని అతి నిరుపేద కుటుంబాల నుండి వచ్చి నర్సింగ్ విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మారుతి నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు కి, కళాశాల యాజమాన్యానికి, కిమ్స్ హాస్పిటల్, భాస్కర హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. ఎల్. కాంతారావు, డాక్టర్ బి.సుబ్బరాజు, ఎస్ఎన్వి రామారావు, డాక్టర్ యం.వి. కోటిరెడ్డి, డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ చైతన్య డిప్యూటీ  డాక్టర్ సంతోష్, డాక్టర్ పి. రాజశేఖర్, టి. సిద్దులు, సీతారామిరెడ్డి, గోళ్ళ భూపతిరావు, చావా లక్ష్మీనారాయణ, వై. సూర్యనారాయణ, పల్లంటి దేశప్ప, వి.కామేశ్వరరావు, రాజు, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.