calender_icon.png 24 November, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.26 కోట్లతో మెదక్ కు నర్సింగ్ కళాశాల

23-11-2024 11:55:07 PM

నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజురు

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలి

మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

మెదక్ (విజయక్రాంతి): మెదక్ నియోజక వర్గానికి రూ.26 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను మంజూరు రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు. గత పదేండ్లలో తెలంగాణ రాష్ర్టంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. మెడికల్ కళాశాల విషయంలో ఆనాటి ప్రభుత్వం కొబ్బరికాయలు కొట్టి మమా అనిపించుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ర్టంలో 26 నియోజక వర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను మంజూరు చేయడం జరిగిందని, అందులో మెదక్ నియోజకవర్గంకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందని ఆయన పేర్కోన్నారు.

రోడ్డుప్రమాదాలను అరికట్టాలి

మెదక్ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై పర్యటించిన ఆయన పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులతో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలతో పాటు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఆయన పేర్కోన్నారు.