calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న నర్సరీ పండ్ల తోటల వేలం

01-04-2025 02:45:22 AM

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మార్చి31 (విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలం లోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడి పండ్ల తోటల వేలం ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.జంబుగా తోటలో బంగినపల్లి, దశేరి తోతాపురి, రసాలు, హిమాయత్, లాంగ్ర వంటి మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. వేలంపాటలో మూడు సంవత్సరాలకు కలిపి 2025, 2026, 2027 పంట కాలానికి ఈ పండ్ల తోటల వేలం జరుగుతున్నట్లు తెలిపారు.

ఎవరికైతే తోట దక్కుతుం దో మూడు సంవత్సరాల పాటు వారే పూర్తి స్థాయి లో ఎరువులు వేయటం, సస్యరక్షణ చర్యలు చేపట్టటం వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలని స్పష్టం చేశారు.ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు రూ. 10,000లు ధారావత్తు సొమ్ముతో ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 11.00 గంటలకు జంబుగా ఉద్యాన నర్సరీలో జరిగే బహిరంగ వేలంలో పాల్గొనాలని ప్రాజెక్ట్ అధికారి సూచించారు.

వేలంలో తోటను దక్కించుకున్నవారు సగం సొమ్మును వెంటనే చెల్లిం చాలి అని, మిగతా సొమ్మును వారం రోజు ల్లో చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐటిడిఏ ప్రాజెక్టు ఉద్యాన అధికారి లేదా సంబంధిత నర్సరీ సాంకేతిక అధికారులను ఫోన్ నంబర్లలో 889747 8825, 9441020755 సంప్రదించాలన్నారు.