22-02-2025 12:00:00 AM
మహబూబాబాద్. ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి) : మహబూబాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నూనావత్ రాధా ను నియమిస్తున్నట్లు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లంబాజీ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలుగా నియమించినందుకు తెలంగాణ రాష్ర్ట అధ్యక్షురాలు సునీతరావు మొగిలి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి కట్టుబడి మహిళ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.