22-10-2024 01:07:41 AM
సెంట్ పీటర్స్‌బర్గ్ (అమెరికా): మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో అరీనా సబలెంకా (బెలారస్) నంబర్‌వన్ ర్యాంకు సాధించింది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సబెలంకా (9706 పాయింట్లు) సొంతం చేసుకోగా.. పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ (9665 పాయింట్లు) రెండో స్థానంలో, గాఫ్ (5963 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.
సబలెంకా, స్వియాటెక్ మధ్య 41 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన సబెలంకా ఇటీవలే వుహాన్ ఓపెన్ కైవసం చేసుకుంది.