calender_icon.png 3 October, 2024 | 4:48 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలి

03-09-2024 04:27:39 PM

ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి

రాబోయే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని  విద్యాలయాల  నిర్మాణం జరగాలి

మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్గొండ,(విజయక్రాంతి): జిల్లాలోని చండూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మునుగుడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మంగళవారం పర్యటించారు.  మున్సిపాలిటీ లోని బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ హాస్పటల్ సందర్శించి రికార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుప్రతిలో ఇప్పటివరకు ఎన్ని డెలివరీలు, ఎంతమంది గర్భిణులు అడ్మిట్ అయ్యారు.  ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వం హాస్పటల్ బిల్డింగ్ ను, అనంతరం నిలిచిపోయిన డబుల్ రోడ్  పనులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులను, భవనాలను  ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. బాలికల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా ఐదు టాయిలెట్లను నిర్మిస్తానని, పనులు వెంటనే మొదలు పెడతామని  ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.