calender_icon.png 12 February, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నుమాయిష్.. మరో రెండు రోజులు!

12-02-2025 01:00:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ మరో రెండు రోజులు కొనసాగే అవ కాశముంది. అందుకోసం పోలీసు శాఖ సానుకూలంగా ఉందని తెలుస్తోంది. నుమాయిష్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కే నిరంజన్, కార్యదర్శి బీ సురేంద ర్‌రెడ్డి, సభ్యులు సుఖేష్‌రెడ్డి, ధీరజ్‌జైస్వాల్‌లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిశారు. ఫిబ్రవరి 17 వరకు పొడిగించాలని కోరారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.