లక్షెట్టిపేట (విజయక్రాంతి): నూజివీడు "శ్రీ అన్నపూర్ణ-7373" వరి పంట వేయడంతో రైతులకు అధిక లాభం వస్తుందని ఆర్ ఎం శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో నూజివీడు అధ్వర్యంలో బొప్పు బాపన్న వరి పంటపై మేగా క్షేత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా బలగం ఫేమ్ దుగ్గంటి కొమరమ్మ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నూజివీడు కంపెనీ ఆర్ ఎం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులందరూ నూజివీడు వారి "శ్రీ అన్నపూర్ణ-7373" వరి విత్తనాలు వాడడం వల్ల రైతులకు అధిక లాభం జరుగుతుందని అన్నారు. నూజివీడు వరి విత్తనాలు రైతులు కోసం తయారు చేయబట్టి 50 సంవత్సరాలు గడిచిందన్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రతి విత్తనాలను తయారుచేయడం జరుగుతుందని అన్నారు. నూజివీడు విత్తనాలు గాలికి కింద పడకుండా గట్టిగా ఉంటాయన్నారు. ఈ విత్తనాలను వాడడంతో రైతుకు అధిక దిగుబడి వస్తుందని అన్నారు. అంతేకాకుండా "శ్రీ అన్నపూర్ణ" అనే వరి రకం పెద్ద గోలుసుతో 140 రోజుల కాలంలో పంట చేతికి వస్తుందని "శ్రీ అన్నపూర్ణ-7373" అనే సూపర్ ఫైన్ సన్న రకం వరి విత్తనాలలో అందుబాటులో ఉంటుందన్నారు. నూజివీడు శ్రీ అన్నపూర్ణతో సాగు ఖర్చు కూడా తగ్గుతుందని రైతులకు సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఏఎస్ఎమ్ రాజ బాబు, ఎండీఓ వేణుగోపాల్, ఎమ్ఓ రాజేశ్ రెడ్డి, ఎండీఓ శిరీష్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు.