06-03-2025 12:31:45 AM
నల్లగొండ, మార్చి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో సామాన్యులే కాదు.. పేరు మోసిన ప్రజాప్రతినిధులు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే మంగళవారం అర్ధరాత్రి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. కాల్ లిఫ్టు చేయగానే ఓ మహిళ నగ్నంగా కనిపిస్తూ మాట్లాడింది.
ఈ క్రమంలో కేటుగాళ్లు వీడి కాల్‌ను స్క్రీన్ రికార్డు చేసి తర్వాత ఆయనకే పంపారు. డబ్బులు ఇవ్వకపోతే వీడి సోషల్ మీడియాలో పెడతామని, పార్టీ నేతలందరికీ పంపుతామని బెదిరించారు. ఎమ్మెల్యే లొంగకపోవడంతో ఆ వీడి కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు.
గమనించిన వారు వెంటనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఖంగుతున్న ఎమ్మెల్యే నకిరేకల్ సీఐకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియో కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి కేసు న చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయంపై బుధవారం ఎమ్మెల్యే వీరేశం స్పందించారు. సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.