calender_icon.png 24 February, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని విమర్శించే స్థాయి నుడా చైర్మన్‌కు లేదు

20-02-2025 01:15:02 AM

కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నంజయ్కుమార్ను విమర్శించే స్థాయి నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి లేదని మాజీ మేయర్ వై సునీల్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం ప్రచారం కోసమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై సుడా చైర్మన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల కాలంలో కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీసినట్లు సుడా చైర్మన్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్ గా కూడా గెలవని వ్యక్తి కేంద్ర మంత్రిని విమర్శించడం. శోచనీయమన్నారు.

ఎలాంటి రాజకీయ కుటుంబం లేని వ్యక్తి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగి, కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న బండి సంజయ్న విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కుల గణన పేరుతో బీసీలు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని అన్నారు.

42 శాతం బీసీలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిమీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాళం వెళ్లదీస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీతోనే కరీంనగర్ నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన అనేక నిధులను రాష్ర్ట ప్రభుత్వం ఖాజానాలో వాడుకుని కేంద్రాన్ని అబాసు పాలుచేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంతా కుమ్ములాటలతో కొట్టుకుపోతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మీరేం చేశారో చెప్పాలని, చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బండి సంజయ్ని విమర్శించడం మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, లేనిెుడల తిప్పికొడతామని సునీల్ రావు అన్నారు.