calender_icon.png 25 December, 2024 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణు క్షిపణి విభాగాన్ని

19-10-2024 02:29:25 AM

పరీక్షించనున్న రష్యా!

మాస్కో, అక్టోబర్ 18: మాస్కోకు వాయువ్య ప్రాంతంలో అణు క్షిపణి విభాగాన్ని రష్యా పరీక్షించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ దేశానికి చెందిన స్ట్రాటజిక్ న్యూక్లియర్ దళ కమాండర్లు ఈ పరీక్షలో పాల్గొంటారని ఆ దేశ రక్షణశాఖ వర్గాలు పెర్కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను సైతం రష్యా  మోహరించినట్లు సమాచారం. ఈ క్షిపణులు ఒక్కొక్కటి దాదాపు 100 కిలోమీటర్ల మేర విధ్వంసం సృష్టించగలవని మంత్రిత్వశాఖ తెలిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రష్యా మధ్య జరుగుతున్న యు ద్ధంలో పశ్చిమదేశాలు జోక్యం చేసుకోకుండా నివారించడానికి రష్యా ఈ అణు విన్యాసాలు నిర్వహిస్తున్న ట్లు అంతర్జాతీయ భద్రతా విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, సరిహద్దులో పె రుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అణ్వస్త్రాల విధానంలో మార్పులు చేసినట్లు ఇటీవల రష్యా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ విన్యాసాలు మొదలుపెట్టాలని తన సైన్యాన్ని ఆదేశించినట్లు ఈ దేశ రక్షణశాఖ వెల్లడించింది.