28-04-2025 12:25:45 AM
పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ పిచ్చి కూతలు కూశారు. భారత్‌పై దాడి చేసేందుకు 130 అణుబాంబులను పాకిస్తాన్ సిద్ధంగా ఉంచిందని మంత్రి వ్యాఖ్యానించారు. కేవలం అణుబాంబులు మాత్రమే కాకుండా ఘోరీ, షహీన్, ఘజ్నవి క్షిపణులను కూడా సిద్ధం చేశామన్నారు.
భారత్ సింధూ జలాలను నిలిపివేస్తే.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. పాక్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు. ‘రెండు రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయింది.
మరో 10 రోజులు మేము గగనతలం మూసేస్తే భారత్‌కు చెందిన విమానయానసంస్థలు దివాలా తీస్తాయి. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. మేము అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు’ అని అబ్బాసీ వ్యాఖ్యానించారు.