calender_icon.png 18 January, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎన్టీఆర్31’కి కొబ్బరికాయ కొట్టేశారు!

10-08-2024 12:05:00 AM

జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తాజా చిత్రం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక నిర్వహించగా.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుటుంబీకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో ఊపు మీదున్న ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే, ఈ కథ గురించి నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దీన్ని అందరూ యాక్షన్ మూవీలా భావిస్తారని నాకు తెలుసు.

కానీ, నేను ఆ జానర్‌లోకి వెళ్లాలనుకోవడంలేదు. వాస్తవానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యమైన చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త అని చెప్పగలను’ అని వివరించారు. డైరెక్టర్ ఇలా చెప్పిన మాటలతో జూనియర్ ఎన్టీఆర్ ఈ భావి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాక, ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది కూడా. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు సైతం సోషల్ మీడియాలో కనిపించాయి. ఎన్టీఆర్31 వర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నారని భోగట్టా.