calender_icon.png 23 December, 2024 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్-నీల్ చిత్రం

23-12-2024 01:07:50 AM

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది. అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతోందో దర్శకుడు బయటపెట్టారు. అప్పట్లో నీల్ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలనుకున్నారు.

అది ఎన్టీఆర్ హీరోగా చేయబోయే సినిమా కోసమేనా? అనే ప్రశ్న నీల్‌కు ఓ తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. ఆయన స్పందిస్తూ ‘ఎన్టీఆర్ హీరోగా చేయబోయేది పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’ అని చెప్పారు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని చెప్పలేదు.

ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘వార్2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారం ఉన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు.