calender_icon.png 21 September, 2024 | 6:04 AM

ఆయుధ పూజ రిలీజ్ వాయిదా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ

19-09-2024 12:06:09 PM

ఆయుధ పూజ పాట కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. పాట రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ఒక ప్రకటనలో తెలిపింది. పాటను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ ఈ నెల 27న థియేటర్లకు రానుంది. 

ఎన్టీఆర్ నుంచి దాదాపు కొన్నేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ‌‘చుట్టమల్లే’ సాంగ్‌కు విపరీతమైన బజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11.07 గంటలకు ‘ఆయుధపూజ’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ నిన్న ప్రకటించారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.