ప్రస్తుతం ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్ సైతం ముగింపు దశకు చేరుకుంది. ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందట. అయితే వీరిద్దరి కాంబోలో రెగ్యులర్ షూటింగ్ తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్రారంభమవుతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరగనుందట.
ఎక్కడైతేనేమి షూటింగ్ అయితే ప్రారంభం కానుందనే వార్త ఎన్టీఆర్ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రం వలసదారుల నేపథ్యంలో రూపొందనుందట. బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొంటు న్న తెలుగు వాళ్లకు ఎన్టీఆర్ రక్షకుడిగా ఉంటాడట. ఈ సినిమా పౌరాణిక కథ అయితే కాదు కానీ.. పురాణ గాథతో టచ్ అయితే ఉంటుందట.