calender_icon.png 18 January, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్

18-01-2025 12:10:56 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజారెడ్డి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని శనివారం ఆదిలాబాద్ లో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందజేసి పేదల ఆకలి తీర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలిపల్లి నాగన్న, రాము, గంగారెడ్డి, గంగమ్మ, దేవిదాస్ తదితరులు ఉన్నారు.